ASR: అనంతగిరి మండలం మద్దిపాడు గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రతకు గ్రామంలోని నేల బావి ఎండిపోవడంతో, సమీపంలోని ఊట నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నామని సోమవారం వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు.