AP: రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీల్లో జరుగుతున్న పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమృత్ 2.0, UIDF, AIIB కింద చేపట్టిన పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి పెండింగ్ డిజైన్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే వర్క్స్ ఇప్పటికీ చేపట్టని చోట త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.