BPT: బల్లికురవ స్థానిక కేజీబీవీ జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టిన అల్ట్రా హై-డెన్సిటీ ప్లాంటేషన్‌ను ఎంపీడీవో కుసుమ కుమారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొక్కల పెరుగుదల, సంరక్షణ చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.