AP: YCPపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉందని.. అది రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతోందని విమర్శించారు. CM చంద్రబాబుపై YCP అధినేత జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఆయన ఒకటి అంటే మేం మూడు అనగలమని అన్నారు. YCP నేతల బండారాన్ని త్వరలోనే బయటపెడతామని, ఆ పార్టీని పాతాళానికి పంపిస్తామని హెచ్చరించారు.