KMR: జూన్ 5వ తేదీలోపు ఒక్క గింజ కూడా మిగలకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయించే బాధ్యత నాది అని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సోమవారం విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్లుల యజమానులతో, సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని, వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.