ASF: కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 6 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పట్టణ పద్మశాలి సేవా సంఘం సోమవారం మద్దతు ప్రకటించింది. మిల్లు గేటు వద్ద దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతూ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు.