NZB: డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష విధించగా మరో 30 మందికి రూ.3 లక్షల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇటీవల నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 32 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సోమవారం ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.