NLG: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం వద్ద రోడ్డు పక్కన సోమవారం గుర్తించిన గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహన్ని సీఐ నాగరాజు, చిట్యాల, నార్కట్పల్లి ఎస్సైలు రవికుమార్, విష్ణుమూర్తి పరిశీలించారు. మృతుడు పింక్ గీతల షర్ట్, బ్లూ ప్యాంటు ధరించి, 45-55 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, మృతదేహం పూర్తిగా ఉబ్బి, కుళ్ళిపోయిన స్థితిలో ఉందని తెలిపారు.