NTR: రాష్ట్రంలో వైద్య సేవలు బేరసారాలతోనే సాగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద ప్రజలు తిరగాల్సి వస్తోందని, LOC ఇచ్చినా ఆసుపత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే, నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల అప్పులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అప్పులను మించాయని అన్నారు.