MNCL: జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ అనే గొర్లకాపరిపై సోమవారం మధ్యాహ్నం అడవిపంది దాడిచేసింది. స్థానికుల కథనం ప్రకారం గొర్లను కాపడానికై మల్లేష్ సమీపంలోని అడవిలోకి వెళ్ళగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. దీంతో మల్లేష్ గట్టిగా కేకలు వేయగా సమీపంలోని గ్రామస్థులు వచ్చి మల్లేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.