E.G: రాజమండ్రిలో నిరంతర నిఘా, పారిశుధ్య చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత తదితర వాటిపై నగర కమిషనర్ పవన్‌కు వివరించారు. వీటిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.