SDPT: క్షయ వ్యాధి అంతం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కళావతి అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా బెజ్జంకి మండలం పోతారంలోని ఓ కంపెనీ సౌజన్యంతో ఫుడ్ బాస్కెట్ పంపిణీ కార్యక్రమాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ నాసర్ పురాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.