గుంటూరు జిల్లాలో కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. మిర్చి, పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ.. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అమరావతి పరిధిలో భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందడం లేదని కిసాన్ మోర్చా కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.