సూర్యాపేట మండలం కేటీఎన్నారం గ్రామంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఉయ్యాల జానయ్య (38) అనే గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డ జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.