NGKL: జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువులు, లేగదూడల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ ఆదేశించారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా పశువులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.