సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్లమ్ స్థాయి, పట్టణ సమాఖ్యల సర్వసభ సమావేశాలు నిర్వహించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత, మెప్మా పీడీ హనుమత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.