KMM: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.