BHPL: గోరి కొత్తపెల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో సోమవారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో రాజేందర్ తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు.