TG: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ‘రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. మిగతా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో ధర్నా చేయాలి. 2 రోజుల్లో వేగం పెంచకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.