GNTR: ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెనాలిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.