AP: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం కింద విద్యార్థికి రూ.13వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. గతేడాది ఆధార్ లింక్ కాకపోవడంతో చాలామంది ఈ స్కీమ్‌కు దూరమయ్యారు. అలాంటి ఇబ్బందులు రాకుండా బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు బ్యాంకుకు వెళ్లి NPCI మ్యాపింగ్ చేసుకోవాలంది.