MDK: హత్నూర్ ఈవో రమేష్ గత ఐదు రోజులుగా రైతు వేదిక కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, కార్యాలయానికి వెళ్లినా ఆయనను కలవడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక రైతు తన పొలం మార్పునకు సంబంధించిన పత్రాలు ఇచ్చినా, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, మళ్లీ పత్రాలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.