అన్నమయ్య: కురబలకోట మండలంలోని కొత్తపల్లిలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు అంజలి తెలిపిన వివరాల మేరకు.. అత్తమామల వేధింపుల విషయాన్ని భర్త పురుషోత్తం రెడ్డికి చెప్పగా ఆగ్రహంతో కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు ఆరోపించారు. గాయపడిన ఆమెను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.