అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) శంషుద్దీన్ సోమవారం పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 25 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ‘బడి పండుగ’ కార్యక్రమంలో భాగంగా సుండుపల్లి మండలంలోని గుంతరాసపల్లి, రెడ్డిగారిపల్లి పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.