NDL: నంద్యాల-గిద్దలూరు వెళ్ళే రైలు మార్గంలో చలమ, బొగద సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని సోమవారం పెద్దపులి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన పెద్దపులిని T-160F(ఆడ పులి)గా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాని వయసు సుమారు నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. కాగా, ఇటీవల ఇదే రైలు మార్గంలో చిరుత పులి, ఎలుగు బంట్లు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.