NDL: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోమవారం బనగానపల్లెలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీ భవన నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఈమేరకు కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు.