ఉదయాన్నే ఖాళీ కడుపుతో కీరదోస తీసుకుంటే శరీరానికి బోలెడంత నీటి శాతం అందుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది. పీచుపదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అయితే, కీరదోసను ఉదయాన్నే సలాడ్ రూపంలో లేదా జ్యూస్ లాగా తీసుకోవచ్చు.