E.G: ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న డిజిటల్ మహానాడు-2026 విజయవంతానికి రాజమండ్రి నగరం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తిలక్ రోడ్డులోని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ సభ్యులతో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం నగరంలోని 12 ప్రత్యేక డిజిటల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.