ATP: గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని 44 హైవే పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.