JN: లింగాల ఘన్పూర్ మండల వ్యవసాయ అధికారి బుర్ర మమత రైతులకు వరికొయ్యలు కాల్చవద్దని సూచించారు. కొయ్యలను కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని సోమవారం తెలిపారు. వాటిని భూమిలో కలిపితే నేల సారవంతం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.