VSP: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుల తాళ్లవలస హైవేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం నుంచి సింహాచలం వైపు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా, డ్రైవర్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.