TG: మేడ్చల్లో ఉంటున్న జయీద్ ఖాన్ను ఉగ్ర లింక్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ISIతో సంబంధాల కోసం అతడు ప్రయత్నించినట్లు తేలింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాద సంస్థలను జయీద్ ఖాన్ సంప్రందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశ భద్రత సమాచారాన్ని ISIకి చేరవేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.