ASR: అనంతగిరి మండలం దొనిగుమ్మిలో గత 40 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం, తాగునీటి వసతి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక అత్యవసర సమయాల్లో రాకపోకలు కష్టంగా మారుతున్నాయని, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.