AKP: నాతవరం జడ్పీ హైస్కూల్ పీఈటీ టీ.అనురాధ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈనెల 23, 24 తేదీల్లో శ్రీలంకలో జరిగిన 30 ఇయర్స్ కేటగిరీలో ఆమె నాలుగు బంగారు పతకాలు సాధించారు. 5000 మీటర్ల రేస్వాక్, 5000 మీటర్ల పరుగు పందెం, 1500 మీటర్ల పరుగుపందెం, హామర్ త్రో విభాగాల్లో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఈమెను పలువురు అభినందించారు.