కడప తాలూకా పరిధిలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని సీఐ నరసింహ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మరియాపురం అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. అపాయ పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్‌లోని SOS ద్వారా లేదా 112కు కాల్ చేస్తే తక్షణ పోలీస్ సహాయం అందుతుందని తెలిపారు.