TG: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై పేషెంట్ బంధువులు దాడి చేయడంతో జూడాలు మెరుపు ఆందోళనకు దిగారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కల్పించేందుకు తక్షణమే ‘స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.