కడపలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోకు తాడుకట్టి లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్.