KDP: పోరుమామిళ్లలో జర్నలిస్టుపై బెదిరింపుల ఘటన కలకలం రేపింది. సీనియర్ రిపోర్టర్ దియ్యాల శ్రీనివాసులుపై దుర్భాషలాడి, కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి వెంకట కృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మీడియా ఫెడరేషన్ నాయకుల ఫిర్యాదుతో స్పందించిన మైదుకూరు డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.