బాపట్ల కలెక్టరేట్లో సోమవారం PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యత ప్రమాణాలతో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఆడిట్ నిర్వహించాలని, ఫీల్డ్ స్థాయిలో పరిశీలించి ప్రజల అభిప్రాయాలు స్వీకరించాలని చెప్పుకొచ్చారు.