NLG: జిల్లాకు ఇప్పటివరకు 4,82,000 ఉచిత పాఠ్యపుస్తకాలు అందగా.. నేటి నుంచి మండలాలకు వీటి సరఫరా ప్రారంభమైంది. తొలిరోజు గుండ్లపల్లి, చందంపేట, నిడమానూరు, అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాలకు 58,097 పుస్తకాలను పంపించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం బిక్షపతి తెలిపారు. జూన్ 5వ తేదీలోపు వీటిని ఆయా పాఠశాలలకు చేరవేయాలని ఎంఈవోలను ఆదేశించారు.