BPT: చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో చల్లారెడ్డిపాలెం సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద శక్తి టీం చీరాల సబ్ డివిజన్ ఇంఛార్జ్ ఎస్సై హరి బాబు, కానిస్టేబుల్ కే. సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు భద్రత, బాల్యవివాహాలు, సైబర్ నేరాలుపై గురించి వివరించారు. అనుమానాస్పద కాల్స్, ఆన్లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.