NDL: డోన్ పట్టణంలో ఈ రోజు డ్రంకెన్ డ్రైవ్ కేసులపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా డోన్ పట్టణానికి చెందిన బెస్త సునీల్ కుమార్ (25) 6 రోజులు జైలు శిక్ష, షేక్ దాదా ఖలందర్ (27) 3 రోజులు జైలు శిక్ష, ప్రశాంత్ కుమార్కు (24) పదివేల రూపాయలు జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ఒక తీవ్రమైన నేరం అని వారు చెప్పుకొచ్చారు.