అన్నమయ్య: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి నియోజకవర్గంలోని మొలకలదిన్నె గ్రామంలో రూ.15.25 కోట్లతో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు.