CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు జేసి ఆదర్శ రాజేంద్రన్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.