BPT: చీరాల పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన శాస్త్రీయబద్ధంగా లేదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని విస్మరించారని విమర్శిస్తూ.. కాంగ్రెస్ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ దానియల్ జోసఫ్‌కు వినతిపత్రం సమర్పించారు. పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.