NTR: రిటైర్డ్ రీజినల్ జాయింట్ కమిషనర్ దేవాదాయశాఖ, మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంకు చెందిన భ్రమరాంబ నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందించిన సందర్భంగా అన్నదాన సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఆలయ అధికారులు దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.