GNTR: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేలు చెల్లించాలని పసుపు రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులకు వినతిపత్రం అందించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 14 వేల బస్తాలు కాలిపోయాయని, సంవత్సరాలు గడుస్తున్న రైతులకు న్యాయం జరగడం లేదని సంఘ నాయకుడు ములకా శివ సాంబిరెడ్డి అన్నారు.