JN: జనగామ పట్టణంలో హమాలీ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఇవాళ ఆవిష్కరించారు. సీఐటీయూ పాలకుర్తి జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న మాట్లాడుతూ.. హమాలీ కార్మికుల శ్రమను పాలకులు దోచుకుంటున్నారని విమర్శించారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 30న జనగామలో జరగనున్న రాష్ట్ర హమాలీ మహాసభలను విజయవంతం చేయాలన్నారు.