TG: సూర్యాపేట జిల్లా చింతలపాటి మధు హత్య కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో జరిగిన సర్పంచ్ రవీందర్ హత్యకు ప్రతికారంగానే ఆయన కుమారుడు జీవన్ ఈ దారుణానికి స్కెచ్ వేశాడు. గతంలో రెండు సార్లు విఫలమై, మే 23న మధును హతమార్చారు. నిందితుల నుంచి కారు, బైక్, కత్తి, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.