SRPT: ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి యాకూబ్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం సమయంలో మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, గ్రామాల్లో ఎండ తీవ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.